Site icon TeluguMirchi.com

మహేష్ కు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రష్మిక

వ‌రుస సినిమాల‌తో ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో టాప్ హీరోయిన్‌గా అతి తక్కువ టైం లో క్రేజ్ తెచ్చుకున్న భామ రష్మిక. క‌న్న‌డంలో చ‌క్క‌టి ప్ర‌తిభ క‌న‌బ‌రిచి టాప్ హీరోయిన్‌గా మారిన ఈ బ్యూటీ.. తెలుగులోనూ ఛ‌లో, గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరూ , భీష్మ సినిమాల‌తో త‌న‌కంటూ మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్ సరసన ఓ మూవీ లో నటిస్తుంది.

మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో అద్భుతమైన నటన కనపరిచి ఆకట్టుకుంది. ఈ క్రమంలో కూర్గ్‌లో ఉన్న రష్మిక మహేష్‌కు అదరిపోయే గిఫ్ట్ పంపింది. అవకాడో ఫ్రూట్స్‌తో పాటు…ఆవకాయను ప్యాక్ చేసి మహేష్ ఇంటికి పార్సిల్ పంపింది. రష్మిక గిఫ్ట్ పంపిన విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియాలో పోస్టు పెడుతూ అభిమానులకు తెలిపారు. అంతేకాకుండా అద్భుతమైన వాతావరణంలో… నోరూరించే గిఫ్ట్ పంపిన రష్మికకు ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. కరోనా లాక్ డౌన్ సమయంలో మాకు అందిన మొట్టమొదటి గిఫ్ట్ ఇదే అంటూ నమ్రతా తెలిపారు.

Exit mobile version