Site icon TeluguMirchi.com

Rathinirvedam : రీ రిలీజ్ కు సిద్దమవుతున్న ‘రతి నిర్వేదం’.. ఎప్పుడంటే ?

Rathinirvedam


ప్రస్తుతం సినీరంగంలో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 2011లో ఘన విజయం సాధించిన ఓ శృంగార ప్రేమ కథా చిత్రం మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది. శ్వేతా మీనన్‌ కథానాయకిగా, టి.కె.రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రతి నిర్వేదం’ చిత్రం రీరిలీజ్ కానుంది. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ చిత్రాన్ని ఈ నెల 11న రీరిలీజ్‌ చేయనున్నారు మేకర్స్‌.

యధార్థ సంఘటనలతో కూడుకున్న పేరొందిన నవల ‘రతినిర్వేదం’ 1978లో సినిమాగా తెరకెక్కి విజయవంతమైంది. అదే టైటిల్‌తో 2011లో శ్వేతా మీనన్‌ కథానాయకిగా తెరకెక్కించారు దర్శకుడు టి.కె.రాజీవ్‌ కుమార్‌. ఇక ఈ చిత్రంలో శ్రీజిత్‌ విజయ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి రచయిత పి.పద్మరాజన్‌ కాగా ఎం.జయచంద్రన్‌ సంగీతం అందించారు.

Exit mobile version