
గత మూడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు బంద్ అయినా సంగతి తెలిసిందే. తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పలు ఆంక్షలతో షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడం తో మళ్లీ షూటింగ్ లతో ఆయా చిత్ర యూనిట్ లు సిద్ధమవుతున్నారు. లాక్ డౌన్ తర్వాత ముందుగా రవిబాబు సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.
రవిబాబు మరో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో ‘క్రష్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి ‘అన్ లాక్ 1.0’ పేరుతో ఇటీవలే పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్టే పోస్టర్ కూడా వైవిధ్యంగా కనిపించిందిఇప్పుడు దాన్ని కూడా పూర్తి చేసి ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. తన సొంత బ్యానర్ ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్స్‌పై రవిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పకుడిగా ఉన్నాడు.
