Site icon TeluguMirchi.com

రవితేజ ..నిర్మాతగా మారబోతున్నాడా..?

చిత్రసీమ లో హీరోలు నిర్మాతలుగా మారడం కామన్. ఇప్పటికీ రాంచరణ్ , మహేష్ బాబు , నాగార్జున , బాలకృష్ణ, నాని , నితిన్ , నాగశౌర్య మొదలగు టాప్ హీరోల దగ్గరి నుండి చిన్న హీరోల వరకు నిర్మాతలుగా మరి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

ఇప్పుడు వీరి బాటలోనే మాస్ రాజా రవితేజ చేరబోతున్నాడు. ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాతో హీరోగా మారిన రవితేజ ‘ఇడియట్’ సినిమాతో సక్సెస్ ఫుల్ హీరోగా మారి పోయాడు. ఈ సినిమా తర్వాత వరుస విజయాలు సాధించడం తో హీరో గా నిలదొక్కుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. మినిమమ్ గ్యారంటీ సినిమాలు అందిస్తూ నిర్మాతల హీరో అనిపించుకున్నాడు రవితేజ. అయితే రవితేజ గత కొంత కాలం గా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2017లో వచ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమా తర్వాత రవితేజకు ఒక్క హిట్ కూడా లేదు,. ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమం లో రవితేజ సొంతంగా ప్రొడక్షన్‌ హౌస్‌ను ఏర్పటు చేస్తున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్లో జోరందుకున్నాయి. ఆ బ్యానర్ లో తాను హీరోగానే కాకుండా కొత్త కాన్సెప్ట్‌లతో వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మించాలని రవితేజ చూస్తున్నారట. మరి ఇది ఎప్పుడు ఎవరితో స్టార్ట్ చేస్తాడనేది చూడాలి.

Exit mobile version