Site icon TeluguMirchi.com

మహేష్ మూవీ లో నటించడం ఫై రేణు స్పందన

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చాడని.. అడవి శేషు తో మేజర్ అనే సినిమా చేస్తున్న మహేష్ అందులో ఓ ప్రముఖ రోల్ కు గాను రేణు ను తీసుకున్నారనే వార్తలు వైరల్ కావడం తో అభిమానులంతా నిజమేనేమో అని తెగ సంబరపడ్డారు. అయితే ఈవార్తల్లో ఏమాత్రం నిజంలేదని రేణు క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటివరకూ ఇదే తాను విన్న అతి పెద్ద రూమర్ అంటూ చమత్కరిస్తూనే అట్టి వార్తలను ఖండించింది. మహేష్ సినిమాలో తాను నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి.. గత రెండు మూడు రోజులుగా తనకు ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయని, చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని తెలిపింది. కాగా ఇలాంటి వార్తలను తెరపైకి తెచ్చిన వారికి రియల్లీ హ్యాట్సాఫ్ అంటూ తనదైన స్టైల్‌లో స్పందించింది రేణు దేశాయ్. మహేశ్ బాబు సినిమాలో తాను నటించడం లేదని క్లారిటీ ఇచ్చేసింది.

Exit mobile version