Site icon TeluguMirchi.com

కేసీఆర్ బయోపిక్ తీస్తానంటూ వర్మ ప్రకటన

వివాదలకు కేరాఫ్ అయినా రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ సినిమా ప్రకటిస్తాడో..ఎప్పుడు ఎవరి గురించి ట్వీట్స్ చేస్తాడో ఎవరికీ తెలియదు. గత కొద్దీ నెలలుగా బోల్డ్ కంటెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న ఈయన..తాజాగా “మా ఇష్టం” (డేంజరస్) అనే సినిమా చేసాడు. అప్సర రాణి, నైనా గంగూలీ లు ప్రధాన పాత్రలో లెస్బియనిజం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 8న వర్మ విడుదల చేయబోతున్నారు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టిన వర్మ..మీడియా తో మాట్లాడుతూ.. ఈ సినిమాను ఓ.టి.టి, థియేటర్లలో రెండింటిలో విడుదల చేస్తాం అని తెలిపాడు. ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తి చేసానని తెలిపిన వర్మ ..తనకు కాశ్మీర్ ఫైల్ సినిమా బాగా నచ్చిందని..త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ సినిమా తెరకెక్కిస్తానని తెలిపి షాక్ ఇచ్చారు. గతంలో కూడా పలు రాజకీయ నేతల బయోపిక్ లు తెరకెక్కించి రాజకీయాల్లో పెను సంచలనం రేపారు. మరి ఇప్పుడు కేసీఆర్ బయోపిక్ తో ఏంచేస్తాడో చూడాలి.

Exit mobile version