
పెళ్లి చూపులు ఫేమ్ రీతూ వర్మ..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాల్గు సినిమాలను లైన్లో పెట్టిందట. లాక్ డౌన్ వేళ అభిమానులతో ముచ్చటించిన ఈ భామ తన తాజా ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకొచ్చింది. తెలుగులో కంటే.. తమిళంలోనే ఎక్కువగా సినిమాలు చేయడానికి కారణం ‘పెళ్ళిచూపులు’ తర్వాత తనకు తెలుగులో ఆసక్తికరమైన కథలేవీ దొరకలేదట. అదే సమయంలో తమిళం నుంచి అవకాశాలు వచ్చాయి. ఫలానా భాషలోనే నటించాలి, ఫలానా పాత్రలే చేయాలనే ఆలోచన ఎప్పుడూ లేదు.
అందుకే తమిళంలో చేశాను అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేస్తున్నానని.. అందులో శర్వానంద్‌తో చేస్తున్నది ద్విభాషా చిత్రం కూడా ఉందని చెప్పుకొచ్చింది. ఈ మధ్య పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అందరూ అడుగుతున్నారు. అమ్మానాన్నలు కూడా నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానా? అని ఎదురు చూస్తున్నారు. దానికి చాలా సమయం ఉందని చెబుతుంటా. అని నవ్వుతూ తెలిపింది.
