
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో కలకలం రేపుతోంది. అవకాశాలు లేక..ప్రేమ వ్యవహారాల కారణంగానే సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్నాడనే వాదనలు వినిపిస్తుండడం పోలీసులు ఆ తరహాలో విచారణ మొదలుపెట్టారు. తాజాగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ రియా చక్రవర్తిని పోలీసులు గురువారం విచారించడం జరిగింది.
ఈరోజు ఉదయం ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్ కు వచ్చిన రియాను విచారించిన పోలీసులు ఆమె నుంచి వాంగూల్మాన్ని తీసుకున్నట్టు సమాచారం. సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న ముందు రోజు రాత్రి రియా చక్రవర్తికి పలుమార్లు కాల్ చేశారు. ఐతే ఆ కాల్ ఆమె లిఫ్ట్ చేయలేదని తెలుస్తుంది. దీనితో ఆమెను విచారిస్తున్నారు.
