
లేవా అంటే పూర్తిగా లేవని కాదు ముందుగా అనుకున్న వాటికన్నా కాస్త తగ్గించే ఆలోచనలో ఉన్నారట. దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటివరకు ఎప్పుడు పడని టెన్షన్ ఆర్ఆర్ఆర్ తో పడుతున్నాడు. ఏ క్షణాన ఈ మూవీ మొదలుపెట్టారో కానీ అప్పటినుండి అన్ని అవాంతరాలే..హీరోలు గాయాలు పాలవ్వడం..నటి నటులు సినిమా నుండి తప్పుకోవడం..ఆతర్వాత అన్ని సెట్ అయ్యాలే అనుకునేలోపు కరోనా రావడం ఇలా అన్ని రావడం తో సినిమా ముందుకు సాగడం లేదు.
ప్రస్తుతం లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా షూటింగ్ లకు అనుమతి రావడం తో దర్శకధీరుడు రాజమౌళి కూడా RRR షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి సన్నాహాలు చేసినప్పటికీ కరోనా కేసులు ఎక్కువగా అవుతుండడం తో షూటింగ్ ను ఇప్పట్లో స్టార్ట్ చేయదకొడదాని డిసైడ్ అయ్యాడు. లాక్ డౌన్ కారణంగా నాలుగు నెలలుగా మూవీ షూటింగ్ ఆగిపోయింది. తిరిగి ఎప్పుడు మొదలవుతుంది అనేది రాజమౌళి కూడా క్లారిటీ లేదు. నటులు, సిబ్బంది ప్రాణాలు పణంగా పెట్టి మూవీ చేయలేం. దీనితో తక్కువ టైం లో మిగిలన 30 శాతం షూటింగ్ పూర్తి చేయాలని రాజమౌళి బావిస్తున్నారు.
ఇందు కోసం ఆయన ఆర్ ఆర్ ఆర్ లో కొన్ని పాటలు తగ్గించే ఆలోచనలో ఉన్నారట. టాప్ స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ నటిస్తున్న ఈ మూవీలో అన్నీ కలిపి పదిపాటల వరకు ప్లాన్ చేశారట రాజమౌళి. అందులో ఓ మూడు పాటలు సుద్దాల అశోక్ తేజ రాసినట్లు తెలిపారు. కాగా కథలో కీలకం కానీ సాంగ్స్ చిత్రీకరణ చేయడకూడదని, వాటిని తన స్క్రిప్ట్ నుండి తీసివేయాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
