
ఆర్ఆర్ఆర్ విడుదలై ఎనిమిది నెలలవుతున్నా, ఈ మాస్టర్ పీస్ సృష్టిస్తున్న అద్భుతాల లిస్ట్ పెరుగుతూనే ఉంది. జక్కన్న టేకింగ్ కి చరణ్, ఎన్టీఆర్ ల మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ తోడవడంతో, ఒక ఇండియన్ ినిమాకి వరల్డ్ మ్యాప్ లో ముందెన్నడూ లేనంత రీచ్ ఆర్ఆర్ఆర్ సినిమాకి వచ్చింది. ధియేటర్స్, ఒటీటీల్లో మ్యాజిక్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్ సినిమా, గత నెల 21న జపాన్ లో రిలీజ్ అయ్యింది. మగధీర సినిమాతో చరణ్ కి, బాహుబలి సినిమాతో రాజమౌళికి జపాన్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక రజినీకాంత్ తర్వాత జపాన్ లో అంత ఫ్యాన్ బేస్ ఉన్న ఇండియన్ హీరో ఎన్టీఆర్. చరణ్ ఎన్టీఆర్ రాజమౌళిలకి మంచి మార్కెట్ ఉండడం, జపాన్ కి స్వయంగా వెళ్లి ప్రమోషన్స్ చేయడం ఆర్ఆర్ఆర్ సినిమాకి అక్కడ మంచి కలెక్షన్స్ రావడానికి కారణమయ్యాయి.
ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో రిలీజ్ అయిన ఫస్ట్ వీక్ లోనే 75 మిలియన్ యాన్ లు కలెక్ట్ చేసి, అప్పటివరకూ ఉన్న ఫస్ట్ వీక్ కలెక్షన్ల రికార్డులని బ్రేక్ చేసింది. అక్కడి నుంచి మొదలైన ఆర్ఆర్ఆర్ హవా, నాలుగో వారంలో కూడా కొనసాగుతోంది. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, జపాన్ లో ఫోర్త్ వీక్ వరకూ ఓవరాల్ గా 250 మిలియన్ యాన్ లను రాబట్టి, జపాన్ హైయ్యెస్ట్ గ్రాస్ రాబట్టిన ఇండియన్ సినిమాల లిస్టులో సెకండ్ ప్లేస్ లో ఉన్న బాహుబలిని బీట్ చేసింది. బాహుబలి సినిమాని బీట్ చేసిన ఆర్ఆర్ఆర్, ఇప్పుడు టార్గెట్ రజినీ రికార్డ్స్ అంటూ ముందుకి వెళ్తోంది. 1995లో విడుదలైన ముత్తు సినిమా, జపాన్ లో 400 మిలియన్ యాన్ లను రాబట్టింది. ఈ మూడు దశాబ్దాల్లో ఏ ఎన్నో ఇండియన్ సినిమాలు జపాన్ లో రిలీజ్ అయ్యాయి కానీ ముత్తు రికార్డ్స్ ని మాత్రం టచ్ చేయలేకపోయాయి. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత జక్కన్న అండ్ టీమ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో త్వరలోనే ముత్తు రికార్డ్స్ ని బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇండియన్ సినిమా ప్రస్తుత ట్రెండ్ ప్రకారం యాబై రోజులు, వంద రోజులు అనే మాట కనిపించట్లేదు కానీ జపాన్ లో మాత్రం ఇంకా ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. కంటెంట్ బాగుంటే అక్కడి థియేటర్స్ లో ఏ సినిమా అయినా లాంగ్ రన్ మైంటైన్ చేస్తుంది. సో ఆర్ ఆర్ ఆర్ జోష్ జపాన్ లో ఇప్పటిలో తగ్గే అవకాశం లేదు. లాంగ్ రన్ లో కలెక్షన్స్ డ్రాప్ అవ్వకపోతే, ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ లో ముత్తు రికార్డ్స్ ని బ్రేక్ చేసి… సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. ఇదిలా ఉంటే రాజమౌళి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందని, విజయేంద్రప్రసాద్ కథ విషయంలో వర్క్ చేస్తున్నాడని చెప్పాడు . ఈ మాట బయటకి రాగానే ట్రిపుల్ ఆర్ 2(RRR 2) అనే టాపిక్ నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది.
