Site icon TeluguMirchi.com

ఆర్ఆర్ఆర్ థియేటర్ లో చరణ్ షాకింగ్ ఎంట్రీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై లోని ఆర్ఆర్ఆర్ ప్రదర్శమవుతున్న థియేటర్ లో సడెన్ ఎంట్రీ ఇచ్చి అభిమానులను షాక్ లో పడేసారు. సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ చూస్తున్న క్రమంలో చరణ్ థియేటర్ లో కనిపించేసరికి వారి ఆనందం మాములుగా లేదు. వెంటనే చరణ్ తో సెల్ఫీ లు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మల్టీ స్టారర్ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ , కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ (మార్చి 25) న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. రెండో వారంలోను కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. నార్త్ లో ఈ మూవీ 200 కోట్ల వైపు పరుగులు పెడుతుండడం విశేషం.

Exit mobile version