Site icon TeluguMirchi.com

ఎస్.జానకి చనిపోయారంటూ పుకార్లు

లెజెండ్ గాయని ఎస్.జానకి చనిపోయారంటూ ఆదివారం సోషల్ మీడియా లో వార్తలు వైరల్ కావడం తో సినీ ప్రముఖులు , అభిమానులు , కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు. ఈ వార్త చూసి ప్రతి ఒక్కరు ఫోన్ల ద్వారా ఎలా జరిగిందనేది తెలుసుకోవడం మొదలుపెట్టారు. అయితే ఇవన్నీ కేవలం పుకార్లే అని తెలిసి హమ్మయ్య అనుకున్నారు.

ఈ వార్తలను చుసిన జానకి కుమారుడు మురళీ కృష్ణ స్పందించాడు. తన తల్లి ఆరోగ్యంగా ఉన్నారని, దయచేసి ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేయొద్దని ఆదివారం సాయంత్రం మురళీ కృష్ణ వేడుకున్నారు. అలాగే, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఈ రూమర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనికిమాలిన రూమర్లు ఎందుకు క్రియేట్ చేస్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. తాను జానకి అమ్మతో మాట్లాడానని, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. దయచేసి సోషల్ మీడియాలో పాజిటివిటీని వ్యాప్తి చేయాలని, ఇలాంటి వదంతులతో ఇతరులను బాధపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

Exit mobile version