Site icon TeluguMirchi.com

గుండెపోటుకు గురైన ప్రముఖ డైరెక్టర్

చిత్రసీమ లో ఏంజరుగుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఓ పక్క కరోనా కారణంగా సినిమా థియేటర్స్ బంద్ అవ్వగా..మరోపక్క చిత్ర సీమకు చెందిన వారంతా వివిధ కారణాలతో మరణిస్తున్నారు. పాపులర్ అయిన ప్రముఖ మలయాళ రచయిత, దర్శకుడు కె.ఆర్.సచ్చిదానందన్ గుండెపోటుకు గురయ్యారు.

మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు త్రిశూర్‌లోని జూబిలీ మిషన్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయనకి క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స అందిస్తున్నారు. 48 ఏళ్ల సాచీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు వెల్లడించారు.

Exit mobile version