
ఒకప్పుడు సల్మాన్ నుండి ఏ పోస్ట్ వచ్చిన నెటిజన్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేది..కానీ ఇప్పుడు అలాలేదు. సల్మాన్ ఏంచేసినా ..ఏ పోస్ట్ పెట్టిన నెటిజన్లు ఓ రేంజ్ వేసుకుంటున్నారు. తాజాగా వ్యాయామం పూర్తైన తర్వాత రిలాక్స్ అయి సెల్ చూస్తూ ఉండగా, అతనిని కెమెరాలో బంధించారు. ఆ ఫోటోని సల్మాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వర్కవుట్ పూర్తైంది అని కామెంట్ రాశారు.
సల్మాన్ పోస్ట్‌కి నెటిజన్స్ నుండి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు సల్మాన్ పోస్ట్‌కి పాజిటివ్‌గా స్పందించే నెటిజన్స్ సుశాంత్ మరణం తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యారు. సుశాంత్ మరణానికి సల్మాన్ కూడా కారణమంటూ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆయనని విమర్శించడంతో పాటు కొందరు ఫాలో చేయడం కూడా మానేశారు.
