
నార్త్ లో సూపర్ హిట్ అయినా బిగ్ బాస్ షో..సౌత్ లో కూడా అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికే మూడు సైజ్ఞాలు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో నాల్గో షో మొదలుకానుంది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే..మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయగా, సెకండ్ సీజన్ ను నాని .. మూడో సీజన్ ను నాగార్జున హోస్ట్ చేసారు. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు ఎవరు హోస్ట్ చేస్తారా అనే ఆసక్తి అందరిలో మొదలయ్యింది.
మొన్నటివరకు నాల్గో సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయబోతున్నారని కొన్ని వార్తలు వచ్చాయి లేదు మళ్ళీ నాగార్జునే బిగ్ బాస్ 4 హోస్ట్ అని అన్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో పేరు తెరపైకి వచ్చింది. అదే బిగ్ బాస్ 4 ను హోస్ట్ ఓ ప్రముఖ హీరోయిన్ చేయబోతుంది అని అది కూడా ఎవరో కాదు నాగార్జున కోడలు అక్కినేని సమంత. ఒకవేళ అదే జరిగితే తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ చేసిన మొదటి లేడీగా సమంత నిలుస్తుంది.
