Site icon TeluguMirchi.com

సమంత కు శ్రీ రెడ్డి సలహా..ఆ హద్దులు దాటొద్దు

Samanatha killing look

నాగ చైతన్య – సమంత లు విడిపోతున్నారంటూ గత కొద్దీ రోజులుగా మీడియా లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఈ వార్తలను కొట్టిపారేస్తుండగా..మరికొంతమంది మాత్రం నిజమే అని చెపుతున్నారు. తాజాగా శ్రీ రెడ్డి సైతం వీరిద్దరూ విడిపోవద్దంటూ తన ఆవేదన పంచుకుంది. సంసారం అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. వాటన్నింటిని పరిష్కరించుకుని కొన్ని విషయాల్లో రాజీ పడుతూ ఉండాలని సూచించింది.

సమంత కాని నాగ చైతన్య అన్నయ్య కాని ఇద్దరు కూడా వారి సంసారంను చక్క బెట్టుకునేందుకు ఒకరు కాకుంటే ఒకరు అయిన కాస్త తగ్గాలని విజ్ఞప్తి చేసింది. ఇద్దరు కూడా చాలా మందికి ఆదర్శంగా ఉన్నారు. చాలా బ్యూటీఫుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు. అలాంటి మీరు విడి పోతే చాలా మంది బాధ పడుతారు. మీరు ఎంతో మందికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి మీరు ఇలా చేయడం ఏమాత్రం బాగా లేదు. సమంత వదిన నువ్వు సంసారాన్ని చక్క బెట్టుకో.. కావాలంటే మోడలింగ్.. సినిమాలు ఏమైనా ఒక హద్దు వరకు చేసుకో అంటూ శ్రీరెడ్డి సూచించింది.

Exit mobile version