
అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భాంగా సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున బర్త్ డే విషెష్ అందజేశారు. వారిలో సమంత చేసిన విషెష్ ప్రస్తుతం వైరల్ గా మారింది. హ్యాపీ బర్త్ డే.. నువ్ టెర్రిఫిక్ పర్సన్‌వి.. నీ ఈ అద్భుతమైన జర్నీలో నేను ఓ చిన్న పార్ట్ అయినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. నువ్ నన్ను ఎంతో ఇన్ స్పైర్ చేశావ్.. నువ్ చెప్పిన మాటలన్నీ నాకు ఎప్పటికీ గుర్తుంటాయ్..నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి అంటూ బన్నీపై సమంత ప్రేమను కురిపించింది.
వీరిద్దరి కలయికలో సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. రీసెంట్ గా పుష్ప మూవీ లో సామ్ ఐటెం సాంగ్ చేసి ఓ ఊపుఊపేసింది.
