Site icon TeluguMirchi.com

పోలీస్ స్టేషన్ కు సంజన సంఘీని ..

బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దీనిలో భాగంగా సుశాంత్ సన్నిహితులతో పాటు, ఆయనకు మానసిక వైద్యం అందించిన డాక్టర్ ని కూడా విచారించడం జరిగింది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ సంజన సంఘీని పోలీసులు విచారణకు పిలిచారు. ఆమెను విచారణకు పిలవటానికి కారణం.. సుశాంత్ తో కలిసి నటించిన చివరి సహనటి కావటమే. సుశాంత్ మానసిక పరిస్థితి.. షూటింగ్ సమయాల్లో అతని తీరు ఎలా ఉండేదన్న విషయాలతో పాటు.. ఇతర విషయాల్ని తెలుసుకునేందుకు ఆమెను విచారణకు పిలిచినట్లుగా తెలుస్తోంది. విచారణకుహాజరైన సంజన.. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Exit mobile version