
కరోనా వైరస్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు చనిపోతున్నారు. ఇప్పటికే పలు రాజకీయ నేతలు , సినీ ప్రముఖులు మొదలగువారు మరణించగా..తాజాగా ఢిల్లీ జట్టు మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ దోబల్ (52) సోమవారం మృతి చెందాడు. ఎయిర్ ఇండియా టీమ్ కోచ్‌గా పనిచేసిన సంజయ్.. గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అతని ఒకప్పటి సహచర బ్యాట్స్‌మెన్ మిథిన్ మాన్హాస్ వెల్లడించాడు.
‘‘సంజయ్‌లో ఆదివారం కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. దాంతో.. నిన్న సాయంత్రం అత్యవసరంగా ప్లాస్మా ట్రీట్‌మెంట్ కూడా చేయించాం. కానీ.. ఈరోజు ఉదయం అతను తుది శ్వాస విడిచాడు. సంజయ్ బ్యాట్స్‌మెన్‌గా తన కెరీర్‌ని ప్రారంభించి.. ఆ తర్వాత ఎయిర్ ఇండియాకి మంచి కోచ్‌గా ఎదిగాడు. వాస్తవానికి ఫిట్‌నెస్‌పై అతను ఎక్కువ శ్రద్ధ కనబర్చేవాడు. కుర్రాళ్లకి కూడా ఫస్ట్ క్రికెట్ కంటే.. ఫిట్‌నెస్‌పైనే ఎక్కువగా పాఠాలు చెప్పేవాడు’’ అని మిథిన్ మాన్హాస్ వెల్లడించాడు. సంజయ్ దోబల్‌కి భార్య, ఇద్దరు కొడుకులు ఉండగా.. ఇద్దరూ రంజీల్లో ఆడుతున్నారు.
