
బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతోంది. అభిమానులు , సినీ ప్రముఖులు ఈ షాక్ నుండి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కాగా సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోగా, దీనిపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దీనిలో భాగంగా సుశాంత్ సన్నిహితులతో పాటు, ఆయనకు మానసిక వైద్యం అందించిన డాక్టర్ ని , బాలీవుడ్ హీరోయిన్ సంజన సంఘీని సైతం పోలీసులు విచారణ ఇచ్చడం జరిగింది. తాజాగా ప్రముఖ హిందీ సినిమా దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రశ్నించనున్నారు ముంబై పోలీసులు. ఈయనతో పాటు ప్రముఖ క్యాస్టింగ్ డైరెక్టర్ షాను శర్మను కూడా ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.
