
భారత్ – చైనా సరిహద్దుల్లో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సంతోష్ బాబు వీర మరణానికి యావత్ దేశ ప్రజలు జై జై లు కొట్టారు. సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా అన్ని రంగాల వారు సంతోష్ బాబు కు నివాళ్లు అర్పించారు. బుధువారం ఆయన మృత దేహాన్ని సూర్యాపేట కు తరలించడం జరిగింది.
కొద్దీ సేపటి క్రితం సూర్యాపేట విద్యానగర్‌లో ఆయన స్వగృహం నుంచి అంతిమ యాత్ర ప్రారంభించారు. పూలతో అలంకరించిన వాహనంలో కల్నల్ మృతదేహాన్ని ఉంచే ముందు సైనిక వందనం సమర్పించారు. సంతోష్ బాబు మృతదేహం వద్ద అతడి తల్లిదండ్రులు, భార్య, ఇతర కుటుంబ సభ్యులు విలపించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. అంతకు ముందు.. సంతోష్ బాబును కడసారి చూసేందుకు సూర్యాపేట వాసులు భారీ సంఖ్యలో విద్యానగర్ చేరుకున్నారు.
