Site icon TeluguMirchi.com

‘సర్కారు’ దోపిడి ఇదేనా..?

మహేష్ – పరశురామ్ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సర్కారు వారి పాట. కృష్ణ బర్త్ డే సందర్భాంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వలన.. షూటింగ్స్ కి అనుమతి లభించినా కొన్ని రోజుల సమయం తీసుకునే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇదిలా ఉంటె ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ స్టోరీ బయటకు వచ్చింది.

అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో చూపించనున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ నడుస్తోంది. ఆసక్తికర కథకు అదనంగా రొమాంటిక్ డోస్ కూడా యాడ్ చేశారంట. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ స్క్రిప్ట్ రాసుకున్నారట డైరెక్టర్. ఇందులో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా చేయనున్నాడు. ఆర్థిక నేరాలకు వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారని అంటున్నారు. మరి ఈ కథ అదేనా కదా అనేది చూడాలి.

Exit mobile version