Site icon TeluguMirchi.com

సర్కారు కోసం బ్యాంకు సెట్ సిద్ధం ..

మహేష్ – పరశురామ్ కలయికలో తెరకెక్కబోయే చిత్రం సర్కారు వారి పాట. కృష్ణ బర్త్ డే సందర్భాంగా ఈ సినిమాను ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితుల వలన.. షూటింగ్స్ కి అనుమతి లభించినా కొన్ని రోజుల సమయం తీసుకునే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట.

ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్డ్రాప్తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం. బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందట. ఈ సినిమాలో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా కనిపించనున్నాడని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం.. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం రామోజీ ఫిల్మ్ సిటీలో బ్యాంకు సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లోనే మాక్సిమం షూటింగ్ అయిపోతుందని అంటున్నారు. సెట్ కోసం నిర్మాతలు భారీగానే ఖర్చు పెడుతున్నారట.

ఇక ఈ మూవీ లో మహేష్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేస్తుండగా .. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.

Exit mobile version