Site icon TeluguMirchi.com

కరోనా బారిన పడిన హీరోయిన్ ఏమంటుందో తెలుసా ..?

లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా సినిమా షూటింగ్లు , అలాగే సీరియల్ షూటింగ్ లు ఇలా అన్ని ఆగిపోయిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిబంధనలు సూచిస్తూ షూటింగ్ లకు అనుమతి ఇచ్చింది. దీంతో పలు సీరియల్స్ , చిన్న సినిమాలు షూటింగ్ లు మొదలుపెట్టాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారిని కరోనా వెంటాడుతుంది. ఇప్పటికే పలువురు నిర్మాతలు , బుల్లితెర నటులు కరోనా బారిన పడగా.. తాజాగా బుల్లితెర హీరోయిన్‌గా మ‌హిళ‌ల విశేష ఆద‌ర‌ణ పొందిన న‌వ్య‌సామి వైర‌స్ బారిన పడింది. ‘నా పేరు మీనాక్షి’ , ‘ఆమె కథ’ సీరియల్స్ లో హీరోయిన్‌గా మ‌రీ ముఖ్యంగా తెలుగు మ‌హిళా ప్రేక్షకులను ఈ హీరోయిన్ అల‌రిస్తున్నారు.

ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న ఆమెకు కరోనా సోకింది. దీనితో ఆమె ఐసొలేట్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకిన ఈ నటి తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్పడంతో పాటు, తన గురించి ఆలోచించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే దాని వలన జరిగే నష్టం ఏమీ లేదని ఆమె చెప్పారు. కరోనా సోకినా వెంటనే కొరెంటైన్ కావడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందుకోండి అని చెప్పుకొచ్చింది.

Exit mobile version