Site icon TeluguMirchi.com

నా ఆరోగ్యం ఫై ఆందోళన వద్దు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉదృతి ఏ రేంజ్ లో ఉందొ చెప్పాల్సిన పనిలేదు. రోజు రోజుకు కేసుల సంఖ్య , మరణాల సంఖ్య పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఇక పాకిస్థాన్ లోను మొదటి నుండి పాజిటివ్ కేసుల సంఖ్య నడుస్తూనే ఉంది. ముఖ్యముగా పాక్ క్రికెటర్లు సైతం దీని బారిన పడ్డారు.

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిదీ అఫ్రిదీ సైతం కరోనా బారిన పడినట్లు స్వయంగా తెలిపి షాక్ ఇచ్చాడు. గత మార్చి నుంచి పాక్‌లో లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ‘అఫ్రిది ఫౌండేషన్’ తరఫున పేదలకి నిత్యావసరాల్ని పంపిణీ చేసిన అఫ్రిదీ.. జూన్‌ నెలలో తనకి కరోనా వైరస్ సోకినట్లు స్వయంగా తెలిపాడు. అఫ్రిదీకే కాదు ఆయన భార్య, ఇద్దరు కూతుళ్లకి కూడా కరోనా వచ్చినట్లు తెలిపారు. ఈ విషయాన్నీ తెలిపిన దగ్గరినుండి అభిమానుల్లో ఆందోళన మొదలు అయ్యింది. ఆయన ఆరోగ్యం గురించి ఆరా చేయడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని పుకార్లు వైరల్ చేయడం స్టార్ట్ చేసారు. అఫ్రిది ఆరోగ్యం విషమించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం స్టార్ట్ చేసారు. దాంతో ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చిన అఫ్రిది.. తన ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వెల్లడించాడు.

కరోనా వైరస్ నుంచి తనతో పాటు భార్య, పిల్లలు కూడా కోలుకున్నట్లు తాజాగా సోషల్ మీడియా ద్వారా అఫ్రిది వెల్లడించాడు. పరీక్షలు చేయించుకోగా.. అందరికీ నెగటివ్ వచ్చినట్లు చెప్పుకొచ్చిన అఫ్రిది.. అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

Exit mobile version