
RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి…మొదటి సినిమాతోనే ఎంత క్రేజ్ తెచ్చుకోవాలో అంత తెచ్చుకున్నాడు. కేవలం ఆయన మాత్రమే కాదు..ఈ సినిమాలో నటించిన హీరో కార్తికేయ..హీరోయిన్ పాయల్ కు సైతం ఎంతో క్రేజీ వచ్చింది. అజయ్…మహాసముద్రం టైటిల్ తో ఓ కథ సిద్ధం చేసి ఎప్పటి నుండి ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు.
ఈ సినిమా నుండి రవితేజతో పాటు నాగచైతన్య కూడా తప్పుకోవడంతో.. ఫైనల్ గా అజయ్.. శర్వానంద్ తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా తాజాగా ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా రాశి ఖన్నా ను ఎంపిక చేసాడట. ఇప్పటికే రాశి ఖన్నాకి కథ వివరించడం ..ఆమె ఓకే చెప్పడం జారిపోయిందని అంటున్నారు. ఈ చిత్రానికి స్క్రిప్టు పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
