Site icon TeluguMirchi.com

శర్వా పెళ్లి కబురు..

Sharva uv

కరోనా టైం లో సినీ స్టార్స్ అంత పెళ్లి పీటలు ఎక్కుతూ అభిమానులను ఆనందపరుస్తున్నారు. ఇప్పటికే రానా , నితిన్ , నిఖిల్ మొదలగు స్టార్స్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కాగా..తాజాగా మరో యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి వార్త అభిమానుల్లో ఆనందం నింపుతుంది.

శర్వా తన చిన్ననాటి స్నేహితురాలిని పెళ్లాడబోతున్నాడని మీడియా, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శర్వా చేసుకోబోయే ఆ ఫ్రెండ్ మహిళా పారిశ్రామికవేత్త అని బిజినెస్ రంగంలో ఇప్పటికే ఆమె యువ మహిళా వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలుస్తోంది.

గత 16 ఏళ్లుగా సినీ పరిశ్రమలో కెరీర్ కొనసాగిస్తున్న శర్వా వయసు 36 సంవత్సరాలు.. ఇంట్లో పెళ్లి ప్రస్తావన తేవడంతో తన మనసులో మాట బయటపెట్టి ఇరు కుటుంబాల వారిని ఒప్పించాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందనేది చూడాలి.

Exit mobile version