Site icon TeluguMirchi.com

సుశాంత్ ఆత్మహత్య కు సోనాక్షి ఏ నిర్ణయం తీసుకుందో తెలుసా..?

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రీసెంట్ గా ఆత్మ హత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మరణం చిత్ర సీమలో హలజడి సృష్టిస్తుంది. కొంతమంది వ్యక్తుల వల్లే సుశాంత్ ఆత్మ హత్య కు పాల్పడ్డని అంటున్నారు. ఈపరిణామాలు బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హాను బాగా కలచి వేశాయని దీంతో ఆమె ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ ని డియాక్టివేట్ చేసింది.

సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నెగెటివిటీ ప్రశాంతత లేకుండా చేస్తుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా అని ఆమె చెప్పారు. సోనాక్షి సిన్హా కూడా వారసత్వం ద్వారా పరిశ్రమకు పరిచమైన వారే. సీనియర్ నటుడు మరియు పొలిటీషియన్ శత్రుజ్ఞ సిన్హా కూతురే సోనాక్షి. ఈమె తల్లి పూనమ్ సిన్హా కూడా నటి కావడం విశేషం.

Exit mobile version