Site icon TeluguMirchi.com

సోనమ్ కపూర్ బేబీ బంప్ పిక్స్ వైరల్


టాలీవుడ్, బాలీవుడ్ లో హీరోయిన్లు ఒక్కొక్క‌ళ్లుగా త‌ల్లి ప్ర‌మోష‌న్ అందుకుంటున్న విష‌యం తెలిసిందే. ప్రెగ్నెన్సీ విష‌యం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి బేబి బంప్ ఫొటోల‌తో రచ్చ చేస్తున్నారు. సోనమ్ కపూర్ కొద్ది రోజ‌లు క్రితం తాను త‌ల్లి కాబోతున్న విష‌యం తెలిపింది. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో గర్భవతిగా తన బేబీ బంప్ ఫోటోను అభిమానులకు చూపించింది. సోనమ్ కపూర్ బ్లాక్ షీర్ కఫ్తాన్ దుస్తులలో కనిపించి తన అభిమానులను ఫిదా చేస్తుంది. ఆమె క్యూట్ పిక్స్‌కి నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం సోన‌మ్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. సోనమ్‌ కపూర్‌ త్వరలోనే తల్లి కాబోతుంది అనే విషయాన్ని కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది.

Exit mobile version