Site icon TeluguMirchi.com

గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న సోనీ చరిష్టా..

రాజ్య‌స‌భ సభ్యులు సంతోష్ కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్రముఖ రాజ‌కీయ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, క్రీడా ప్ర‌ముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు.

తాజాగా స్వతహాగా స్వీకరించి మొక్కలు నాటారు నటి సోనీ చరిష్టా. హైదరాబాద్ లోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం చేపట్టిన కార్యక్రమం కాబట్టి నేను స్వతహాగా ఈ ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది అని.. మొక్కలు నాటడమే కాకుండా కొన్ని మొక్కలను దత్తత తీసుకోని సంరక్షిస్తానని సోనీ చరిష్టా తెలిపారు.

Exit mobile version