Site icon TeluguMirchi.com

ఈరోజుల్లో హీరో ఇంట్లో విషాదం

చిత్రసీమ లో కరోనా తాకిడి గట్టిగానే ఉంది. ఇప్పటికే పలువురు సినీ , బుల్లితెర నటి నటులు దీని బారిన పడగా..తాజాగా ఈరోజుల్లో ఫేమ్ శ్రీ తండ్రి వెంకట దుర్గా రాంప్రసాద్‌ కరోనా వైరస్ తో కన్నుమూశారు.

గత 20 రోజులుగా కరోనాతో బాధపడుతూ ఆయన విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటలకు తుది శ్వాస విడిచారు. మారుతి తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ రోజుల్లో సినిమాతో శ్రీ హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక శ్రీ తండ్రి మరణం వార్త తెలుసుకున్న సన్నిహితులు , సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Exit mobile version