
సినీ స్టార్స్ ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ ని తీసుకొస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా నటుడు శ్రీ విష్ణు ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ ఛాలెంజ్ ను విసిరారు. ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్ వలే ఇది కూడా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ముఖ్యమైనదే. అందుకే సెలబ్రిటీలందరూ ఈ ప్లాస్మా ఛాలెంజ్‌లో పాల్గొనాలని, తద్వారా వారి అభిమానులు స్ఫూర్తి పొంది ప్లాస్మా డొనేట్ చేస్తే ఓ ప్రాణం నిలబడుతుందనేది శ్రీవిష్ణు ఆలోచన.
కరోనా నుంచి కోలుకున్న వారందరూ ప్లాస్మా దానం చేస్తే, ప్రస్తుతం కరోనాతో సీరియస్ కండీషన్‌లో ఉన్న ఎందరినో కాపాడవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే శ్రీవిష్ణు ఇలా రంగంలోకి దిగారు.
