Site icon TeluguMirchi.com

పాపం.. శృతి హాసన్..ఒంటరిగా ఆపని చేసుకుంటుంది..

కమల్ కూతురి గా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన శృతి హాసన్..కెరియర్ మొదట్లోనే ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకొని..ఆ తర్వాత గోల్డెన్ గా లెగ్ మారింది. వరుస సక్సెస్ లు అమ్మడిని పలకరించడం తో అగ్ర హీరోల ఛాన్సులు తలుపు తట్టాయి. కానీ అమ్మడు మాత్రం వాటిని కాదని ప్రేమలో పడి సినిమాలకు దూరం అయ్యింది. ఇక ప్రేమ విఫలం కావడం తో మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది.

ప్రస్తుతం తెలుగు లో రవితేజ సరసన క్రాక్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది. లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ అయినా ఈ భామ అభిమానులకు టచ్ లో ఉంటుంది. తాజాగా ఈ ఫోటోను షేర్ చేసిన శృతి హాసన్ తనకు తాను హగ్ చేసుకుంటున్నట్లుగా పేర్కొంది. మాస్ట్రింగ్ ఆర్ట్ హగ్ అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసి చాలామంది రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version