Site icon TeluguMirchi.com

ఒకే సినిమాలో సుమన్, భానుచందర్… చూసి ఎన్నాళ్ళైందో!


వరుణ్‌ కృష్ణ ఫిల్మ్స్‌ బ్యానర్‌ పై శేషుదేవరావ్‌ మలిశెట్టి నిర్మాణంలో శ్రీకృష్ణ మలిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “నువ్వే నా ప్రాణం!. కిరణ్‌రాజ్‌, ప్రియాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్‌, భానుచందర్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని డిసెంబర్‌ 30న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు.

భానుచందర్‌ మాట్లాడుతూ… సివిల్‌ ఇంజనీర్‌కి మూవీ డైరెక్షన్‌కి ఎక్కడా కూడా కనెక్షన్‌ అనేది లేదు. కానీ మొదటి నుంచి కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చేశారు ఆయన. సెట్స్‌లో కూడా ఎన్ని పనులు ఉన్నా చాలా బాగా హ్యాపీగా పనిచేసేవారు. ఆయనకు ప్రతీ డిపార్ట్‌మెంట్‌పైన ఎంతో గ్రిప్‌ ఉంది. ఇద్దరు దంపతులు కూడా చాలాబాగా చూసుకున్నారు. ఇటువంటి చిత్రాలను అందరూ ఆదరించి మూవీని పెద్ద హిట్‌ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

సుమన్‌ మాట్లాడుతూ… సడెన్‌గా నేను యాక్టర్‌ అయ్యాను. ఇన్నేళ్ళ నా సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించాను. నాకు మొదటిసారి అవకాశాన్ని ఇచ్చిన నా గాడ్‌ ఫాదర్‌ రామన్నగారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే తర్వాత నా గాడ్‌ బ్రదర్‌ భానుచందర్‌ అని చెప్పాలి. ఆయన నాకు తెలుగు రాకపోయినా ఎంతో ఎంకరేజ్‌ చేసి నన్ను కన్నడ చిత్రాల్లోనే కాక తెలుగు సినిమాల్లో నటించేలా చేశారు. ఇకపోతే నేను భానుచందర్‌గారు ఇద్దరం కూడా మార్షల్‌ ఆర్ట్స్‌ ఆర్టిస్టులం. అందువల్ల మేమిద్దరం ఎక్కవ దగ్గరయ్యాం. ఎప్పటి నుంచో స్నేహితులుగా ఉన్నాం. తమిళ్‌లో ఇద్దరం కలిసి నాలుగైదు చిత్రాల్లో నటించాము. ఇక ఈ చిత్ర విషయానికి వస్తే స్టోరీ నచ్చి ఓకే చెప్పాను. సెట్‌కి వెళ్ళగానే ఆయన సీన్‌ న్యారేట్‌ చేస్తున్నదాన్ని బట్టి ఎంతో అవగాహన ఉన్న దర్శకుడిలా అనిపించారు. ఎంతో కంపర్టబుల్‌ దర్శకుడు ఆయన. అలాగే ప్రొడక్షన్‌ వ్యాల్యూస్‌ కూడా చాలా బావున్నాయి. ఫిల్మ్‌ ప్రమోషన్స్‌ కూడా చాలా బాగా చేస్తున్నారు. హీరోహీరోయిన్లు ఈ చిత్రంలో బాగా నటించారు. అందరూ ఈ సినిమాని ఆదరించి మంచి హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

Exit mobile version