
మొన్నటి వరకు మోస్ట్ బ్యాచిలర్స్ గా ఉన్న హీరోలంతా పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు. ఇప్పటికే నిఖిల్ , నితిన్ , రానా వంటి వారు పెళ్ళికి సిద్ధం కాగా..తాజాగా సందీప్ సైతం తన మనసులోని కోరిక బయటకు తీసాడు. తాజాగా సందీప్ పెళ్లి గురించి అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు.
సందీప్ గత మూడేళ్ళుగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నాడట. ప్రస్తుతం ఓ మంచి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నాడట. అలాగే తను చేసుకోబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే స్మార్ట్, స్ట్రాంగ్ మరియు స్ఫూర్తిని ఇచ్చే అమ్మాయి అయి ఉండాలని తెలిపాడు. మరి ఆ లక్షణాలున్న అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో చూడాలి.
