Site icon TeluguMirchi.com

సిక్స్ ప్యాక్ తో చించేసిన సందీప్

యంగ్ హీరో సందీప్ కిషన్ సిక్స్ తో దర్శనం ఇచ్చి చించేసాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సందీప్ కిషన్..‘నిన్ను వీడని నీడను నేనే’తో హిట్ కొట్టేసరికి మనోడి జాతకం మారినట్లే అని అంత అనుకున్నారు. అల అనుకున్నారో లేదో వెంటనే తెనాలి రామకృష్ణ రూపంలో మరో ప్లాప్ పడింది. దీంతో తన తదుపరి సినిమాలను చాల జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్.

ప్రస్తుతం సందీప్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొలను ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌ పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగ‌ర్వాల్, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం లాక్ డౌన్ తో షూటింగ్ కు బ్రేక్ పడడంతో ఈ లోపు సందీప్ సిక్స్ ప్యాక్ ట్రై చేసారు. దానికి సంబందించిన పిక్ ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో అది ఇప్పుడు వైరల్ గా మారింది.

Exit mobile version