Site icon TeluguMirchi.com

సిటిమార్ లో సునీల్ రోల్ ఇదేనా..?

యాక్టర్ సునీల్ ..మళ్లీ ఇండస్ట్రీ లో తన సత్తా చాటుకోవాలని గట్టిగానే ట్రై చేస్తున్నాడు. హీరో వేషాలు పక్కన పెట్టి తనకు కలిసొచ్చిన కమెడియన్ , క్యారెక్టర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తున్నాడు. కాకపోతే తాను అనుకున్న పేరు పాత్రలు దక్కడం లేదు. రీసెంట్ గా డిస్కో రాజా చిత్రం విలన్ అవతారం లో కనిపించాడు. కాకపోతే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఢమాల్ అనడం తో ఈయన విలన్ రోల్ జనాలు మాట్లాడకుండా అయిపోయారు.

ప్రస్తుతం ఈయన కు సూపర్ రోల్ దొరికినట్లు తెలుస్తుంది. గోపీచంద్‌ ప్రస్తుతం చేస్తోన్న సినిమా ‘సిటీమార్’. సంపత్‌ నంది డైరెక్షన్ లో రాబోతున్న ఈ స్పోర్ట్స్‌ బేస్డ్‌ మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కామెడీ కోసం కోచ్ అసిస్టెంట్ పాత్రను చాలా వైవిధ్యంగా మలిచారట డైరెక్టర్. ఆ పాత్రలో సునీల్ నటిస్తున్నాడట. చాల కాలం తరువాత సునీల్ కి మంచి కామెడీ క్యారెక్టర్ దొరికిందని.. ఈ సినిమాతో సునీల్ దశ తిరుగుతుందని అంటున్నారు.

Exit mobile version