Site icon TeluguMirchi.com

చీరలో సన్నీ ఏ ఆట ఆడిందో తెలుసా..?

సన్నీ లియోన్..ఈ పేరు తెలియని యువకుడు ఉండడు..ఇక నెటిజన్ల కు అయితే ఈ పేరునే నామస్మరణం చేస్తారు..పోర్న్ స్టార్ నుండి హీరోయిన్ గా మారిన ఈ హాట్ బ్యూటీ..తెరకు పరిచయమైనా కొత్తలో వరుస ఆఫర్లతో బిజీ అయ్యింది. కానీ ఆ తర్వాత అమ్మడి జోరు పూర్తిగా తగ్గింది. దీంతో సొంతగా వ్యాపారాలు మొదలుపెట్టి ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుంది. ఇక అప్పుడప్పుడు హాట్ అందాలతో సెగలు పుట్టిస్తూ వస్తుంది. తాజాగా సన్నీ లియోన్ చీరకట్టులో భర్తతో కలసి బాస్కెట్‌ బాల్‌ ఆడింది. దానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎరుపు రంగు చీరలో భర్త డేనియల్‌ వెబర్‌తో కలిసి బాస్కెట్‌ బాల్‌ ఆడుతూ సందడి చేసింది.

ఆ మధ్య ‘ఓ మై ఘోస్ట్‌’ కోసం సన్నీ వేసిన లుంగీ స్టెప్పులు కూడా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. సన్నీ ప్రస్తుతం ‘ఓ మై ఘోస్ట్’ మూవీతో పాటు.. ‘వీరమాదేవి’, ‘రంగీలా’, ‘షెరో’, ‘కోకకోలా’, ‘హెలెన్‌’ లతో పాటు విష్ణు సరసన ఓ మూవీ లో నటిస్తుంది. View this post on Instagram

A post shared by Sunny Leone (@sunnyleone)

Exit mobile version