
ఎమ్మెస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురైయ్యారు. తాజాగా మరో విషాదం సుశాంత్ కుటుంబం లో చోటుచేసుకుంది.
సుశాంత్ మృతిని తట్టుకోలేక అతని వదిన మరణించారు. సోమవారం ముంబైలో సుశాంత్ దహన సంస్కారాలు జరుగుతుండగా… బీహార్‌లో అతని అన్నగారి భార్య కన్నుమూశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం సుశాంత్ మరణించాడని తెలియగానే అతని వదిన తీవ్రంగా కలతచెంది తినడం మానేశారు. దాంతో ఆమె చనిపోయినట్లు సమాచారం .
