
ఎమ్మెస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 34 సంవత్సరాల వయసున్న ఈయన బాంద్రాలోని తన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నాడు. సుశాంత్ మరణవార్త విన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ గురైయ్యారు. అయితే.. ఏ హీరోకు లేని స్పెషాలిటీ సుశాంత్ సింగ్‌కు ఉంది.చిన్నప్పటి నుంచి అంతరిక్షం అంటే ఎక్కువగా ఇష్టపడే సుశాంత్ సింగ్.. చందమామపై స్థలం కొన్నాడు. అక్కడ స్థలం కొన్న ఏకైక భారతీయ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావడం విశేషం.
ఒక సుశాంత్ సోషల్ మీడియా అకౌంట్ చూస్తే.. ఎక్కువగా అంతరిక్షానికి సంబంధించిన ఫోటోలే ఎక్కువగా ఉన్నాయి. ఇక చందమామాపై సుశాంత్ కొన్న ఈ స్థలాన్ని లూనార్ లాండ్ రిజిస్ట్రీ నుంచి కొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా వీళ్లే చందమామపై స్థలాలను విక్రయిస్తున్నారు. అంతకు ముందు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌కు ఓ అభిమాని చందమామపై స్థలం కొని ఆయకు బహుమతిగా ఇచ్చాడు.

