Site icon TeluguMirchi.com

నిర్మాత గా మారిన చిరంజీవి పెద్ద కూతురు

మెగా ఫ్యామిలీ నుండి మరో ప్రొడ్యూసర్ అయ్యారు. ఇప్పటికే అల్లు అరవింద్ , నాగబాబు , రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు ఉండగా..తాజాగా చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ప్రొడ్యూసర్ గా మారారు.

సుస్మిత నిర్మాతగా నేడు ఓ వెబ్ సిరీస్ ప్రారంభమైంది. సుస్మిత తల్లిగారైన సురేఖ ఈ వెబ్ సిరీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. పూజ కార్యక్రమాలతో వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభమైనది. ఈ వెబ్ సిరీస్ నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సివుంది.

సుస్మిత చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 మరియు సైరా చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిర్మాత గా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.

Exit mobile version