Site icon TeluguMirchi.com

రాజధానికి చేరుకున్న మిడతల దండు ..

ఇప్పటికే కరోనా తో తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..ఇప్పుడు మరో ముప్పు వచ్చి చేరింది. ఆఫ్రికా ఖండం నుంచి బయలుదేరిన మిడతల దండు దేశాలు, సముద్రాలు దాటుకొని పాకిస్తాన్ మీద దాడి చేసాయి. అక్కడ లక్షలాది ఎకరాలపై మిడతలు దాడులు చేసి పంటను నాశనం చేసాయి. అక్కడి నుంచి ఈ ముడతలు గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్ లోని పంటలపై దాడులు చేశాయి. ఈ పంటలపై చేసిన దాడుల వలన వందలాది ఎకరాల పంటలు నాశనం అయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీకి పక్కనే ఉన్న గుర్గావ్‌కు చేరుకున్నాయి.. ఆ త‌ర్వాత ఢిల్లీ ప‌రిస‌రాల్లోకి ప్ర‌వేశించాయి.. వేలాది మిడతలు ఆకాశాన్ని కప్పేసిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నిమ‌స్తున్నాయి.. గుర్గావ్‌లోని పలు ప్రాంతాల్లో విస్తరించిన మిడతలు.. కొన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లనూ కవర్ చేశాయి. అక్కడి బిల్డింగ్‌ల్లో ఉంటున్న కొందరు ప్రజలు మిడతలు దండు వ్యాపించి ఉన్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Exit mobile version