Site icon TeluguMirchi.com

విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ షిప్ గురించి తమన్నా ఏమన్నదంటే..


మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా క్రేజీ ప్రాజెక్ట్స్‌లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉంది. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అయితే బాలీవుడ్‌లో సెటిలైన టాలీవుడ్ యాక్ట‌ర్ విజ‌య్ వ‌ర్మ‌తో ప్రేమ‌లో ఉంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఎప్పుడూ సినిమాల‌తో బిజీగా ఉండే ఆమెపై ఈ వార్త‌లు రావ‌టానికి కార‌ణం.. న్యూ ఇయ‌ర్ రోజున వారిద్ద‌రూ క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌టమే. అంతే కాకుండా ఇద్ద‌రూ క‌లిసి ఎయిర్ పోర్టులో సంద‌డి కూడా చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అదే త‌రుణంలో వారిద్ద‌రూ త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

అప్పుడంతా విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ షిప్ గురించి స్పందించ‌ని త‌మన్నా.. రీసెంట్‌గా స్పందించింది. నేను, విజ‌య్ క‌లిసి ఓ సినిమాలో న‌టించాం. అప్ప‌టి నుంచి మాపై వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే వీటిపై స్పందించాల్సిన అవ‌స‌రం నాకు లేదు. ఇంత‌కు మించి చెప్పాల్సిన విష‌యాలు లేవు. డాక్ట‌ర్ నుంచి బిజినెస్‌మ్యాన్ వ‌ర‌కు ఇప్ప‌టికే చాలాసార్లు నా పెళ్లి చేసేశారు. అంటూ త‌న పెళ్లిపై వ‌చ్చిన వార్త‌ల‌ను వ్యంగ్యంగా ఖండించింది త‌మ‌న్నా. దీంతో విజ‌య్ వ‌ర్మ మ‌ధ్య ల‌వ్ లాంటిది ఏదీ లేద‌ని చెప్ప‌క‌నే చెప్పేసింది త‌మన్నా.

Exit mobile version