Site icon TeluguMirchi.com

కరోనా దెబ్బకు కిరాణ షాప్ పెట్టుకున్న డైరెక్టర్

కరోనా దెబ్బ మాములుగా లేదు. ఆరోగ్య పరంగానే కాదు ఆర్ధికంగా కూడా తీవ్ర నష్టాలకు గురి చేస్తుంది. ఇప్పటికే దీని కారణంగా చాలామంది ఉపాధి కోల్పోగా..ఇక చిత్రసీమ కు చెందిన వారికీ నీడ లేకుండా అయిపొయింది. షూటింగులు లేకపోవడంతో చాలామంది ఖాళీగా ఉంటున్నారు. అలా ఖాళీగా ఉండటం ఇష్టంలేక.. ఆర్థికంగా నిలబడడం కోసం ఓ తమిళ దర్శకుడు కిరాణ షాప్ పెట్టుకున్నాడు.

చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్ కుటుంబ పోషణ భారం కాకుండా ఉండేందుకు ఈ విధంగా కిరాణ షాప్ తెరిచాడు. దర్శకుడు ఆనంద్ గతంలో ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ ‘మౌనా మజాయ్’ సినిమాలు చేసి తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రస్తుతం అతడు ‘తునింతు సీ’ అనే సినిమా షూటింగ్ మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఉన్న చేసిన ఆయన ఇలా చేయడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఖాళీగా ఉండలేక స్నేహితుడి సాయంతో కిరాణ షాపు తెరిచినట్టు చెప్పాడు.

Exit mobile version