Site icon TeluguMirchi.com

ఫ్యాన్స్ కు విజయ్ రిక్వెస్ట్

తమిళ్ హీరో విజయ్ కి ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందన్న..ఆయన పుట్టిన రోజు వస్తుందన్న అభిమానులు పెద్ద పండగల భావిస్తారు. వారం రోజుల ముందే హడావిడి మొదలుపెట్టి వారి అభిమానాన్ని చాటుకుంటారు. కానీ ఈసారి మాత్రం విజయ్ తన అభిమానులకు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు.

ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా హీరోలంతా తమ ఫ్యాన్స్ ని ఎలాంటి సంబరాలు జరుపుకోవద్దని చెపుతున్నారు.విజయ్ కూడా తన అభిమానులు రిక్వెస్ట్ చేసాడు. ఈ నెల 22 తన పుట్టినరోజున ఎవరూ బయట సంబరాలు చేసుకోవద్దని బ్యానర్లు కానీ పోస్టర్లు కానీ ఎక్కడా పెట్టొద్దని వాటికి బదులుగా సామాజిక సేవ చెయ్యమని అభిమానులకు సూచించారు.

Exit mobile version