
హైదరాబాద్ లో గత కొద్దీ రోజులుగా ట్రఫిక్ పోలీసులు కార్లకు బ్లాక్ స్టిక్కర్స్ ఉంటె వాటిని తొలగించి, ఆ కార్లకు ఫైన్ విధిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కువగా సినీ ప్రముఖులు ఈ బ్లాక్ స్టిక్కర్లను వాడుతుంటారు. అయితే వారికే ఎక్కువ సంఖ్యలో ఫైన్ లు పడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ , మంచు మనోజ్ వంటి వారి కార్లకు ఫైన్ వేసి స్టిక్కర్లను తొలగించిన పోలీసులు , ఈరోజు త్రివిక్రమ్ కారుకు సైతం ఫైన్ విధించారు.
ఈరోజు ఉదయం జూబ్లీ హిల్స్ లో తనిఖీలు చేస్తుండగా..త్రివిక్రమ్ బ్లాక్ స్టికర్ తో రావడం తో కారు ను ఆపి , స్టికర్ ను తొలగించి రూ.700 ఫైన్ వేశారు. ఇక త్రివిక్రమ్ సినిమాల విషయానికి వస్తే..రీసెంట్ గా భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న త్రివిక్రమ్..ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉన్నాడు.
