Site icon TeluguMirchi.com

తెలంగాణ లో గురువారం ఎన్ని కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి ఇప్పట్లో ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపించడం లేదు.రోజు రోజుకు కేసులు పెరగడమే తప్పదా తగ్గడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 18 వేలు దాటిపోగా .. గడిచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 1213 కొత్త కేసులు నమోదు అయ్యి సంచలనం రేపాయి. ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18570కి చేరింది. ఇందులో 9226 కేసులు యాక్టివ్ గా ఉండగా, 9069 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ 24 గంటల్లో కరోనా కారణంగా 8 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 275కి చేరింది.

1213 కొత్త కేసుల్లో జీహెచ్ఎంసి పరిధిలోనే 998 కేసులు ఉండటం విశేషం. జీహెచ్ఎంసి పరిధిలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 5356 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 98,153కి చేరింది.

Exit mobile version