Site icon TeluguMirchi.com

ఏపీ విద్యార్ధులకు తీపికబురు తెలిపిన టీఎస్ ..

ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులకు తీపి కబురు తెలిపింది టిఎస్ సర్కార్. తెలంగాణ ఎంసెట్ 2020ను పరీక్షలను నిర్వ్హయించేందుకు విద్యామండలి సిద్ధమైంది. జూలై 6,7,8 తేదీల్లో ఇంజనీరింగ్.. అలాగే జూలై 8,9 తేదీల్లో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు జరగనున్నాయి.

టీఎస్ ఎంసెట్ ఎగ్జామ్‌ రాసే ఏపీ విద్యార్ధులకు తమ పరీక్షా కేంద్రాలను మార్చుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో అవకాశం ఇచ్చింది. ఇవాళ అర్ధరాత్రి లోపు eamcet.tsche.ac.inను సంప్రదించాలని సూచించింది. రోజుకు 50 వేల మంది స్టూడెంట్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాస్తారని.. తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. రూ. 5 వేల ఫైన్‌తో ఈ నెల 25 వరకు, రూ. 10 వేల జరిమానాతో ఈ నెల 30 వరకు ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Exit mobile version