Site icon TeluguMirchi.com

Udayanidhi Stalin : సినిమాలకు బై.. బై…


కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. తాను సినిమాలకు దూరం అవుతున్నట్లు చెప్పి షాక్ ఇచ్చాడు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ తన తండ్రి స్టాలిన్ మంత్రి వర్గంలో తాజాగా చోటు దక్కించుకున్నాడు. ఇక ఆ మధ్య కమల్ హాసన్ హీరోగా ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో ఒక సినిమా అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా నుండి ఉదయనిధి తప్పుకున్నారని తెలుస్తోంది. హీరోగా కాకుండా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా కొనసాగుతున్నారని తెలుస్తోంది. మరి సినిమాకు గుడ్ బై చెప్పిన ఈ హీరో రాజకీయాల్లో తండ్రితో కలిసి ఎలా రాణిస్తాడో చూడాలి.

Exit mobile version