
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరో అయినా వ్యక్తి ఉదయ్ కిరణ్. చిత్ర సీమలో వారసుల ఎంట్రీ తప్ప మరొకరి హీరో అయ్యే ఛాన్స్ తక్కువ అనే నేపథ్యంలో ఉదయ్ ఎంట్రీ ఇచ్చి టాప్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. తేజ డైరెక్షన్లో చిత్రం మూవీ ద్వారా హీరో అయ్యాడు.
ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే, శ్రీరామ్, నీ స్నేహం, కలుసుకోవాలని లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయన. కానీ వెంటనే కెరీర్‌లో కొన్ని ఒడిదుడుకులు.. ఆ తర్వాత కుదుపులు.. అవకాశాలు సన్నగిల్లడం.. పర్సనల్ లైఫ్‌లో కూడా కొన్ని సమస్యలు రావడంతో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు.
అయితే ఉదయ్ కిరణ్ చివరిగా చిత్రం చెప్పిన కథ అనే చిత్రంలో నటించగా, ఆ సినిమాని రిలీజ్ చేయాలని నిర్మాతలు ఎంతగానో ప్రయత్నించారు. ఎట్టకేలకి ఉదయ్ కిరణ్ నటించిన చివరి చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్దమైనట్టు తెలుస్తుంది. వీలైనంత త్వరగా చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. తమ అభిమాన నటుడు చివరి సినిమా రిలీజ్ అవుతుంది అనే సరికి అభిమానులలో విపరీతమైన ఆసక్తి పెరిగింది. ఉదయ్ కిరణ్ మొదటి మూవీ చిత్రం కాగా ఆయన చివరి మూవీ చిత్రం చెప్పిన కథ కావడం విశేషం.
